రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన హాకీ ప్లేయ‌ర్ సునితా ల‌క్రా

భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు డిఫెండ‌ర్‌, మాజీ కెప్టెన్‌ సునితా ల‌క్రా ఇవాళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. మోకాలి నొప్పి వ‌ల్ల అంత‌ర్జాతీయ హాకీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆమె చెప్పింది. దీంతో టోక్యోకు వెళ్లే ఒలింపిక్ జ‌ట్టుకు ఆమె దూరం కానున్న‌ది. 2008 నుంచి ల‌క్రా ఇండియాకు ఆడుతున్న‌ది. 2018లో ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన‌ భార‌త్‌కు ఆమె కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించింది. 2018లో ఆసియా గేమ్స్‌లో ల‌క్రా నేతృత్వంలో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. కెరీర్‌లో మొత్తం 139 మ్యాచ్‌లు ఆడిందామె.