మండలంలోని పోల్కంపల్లి గూంపోల్‌గుట్టు శారద చంద్రమౌళీశ్వరస్వామి (మల్లయ్య) జాతర గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఉత్సవాలు నాలుగు రోజులపాటు వైభవంగా జరిపించేందుకు గ్రామస్తులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు గురువారం వార్షికోత్సవం, గణపతి పూజ, పుణ్యాహవచనం, ఏకదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, చండీ హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 21న అభిషేకం, అర్చనలతో ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు. 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. రాత్రి 9 గంటలకు లింగోద్భవ అభిషేకం, శారదా చంద్రమౌళీశ్వరస్వామి వారికి కల్యాణం జరిపిస్తారు. 22వ తేదీన పూజా కార్యక్రమాలతో పాటు, బోనాల ఊరేగింపు ఉంటుంది. 23వ తేదీన శకటోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.