15 డాలర్లకు పడిపోయిన చమురు ధర

కరోనా దెబ్బకు ముడి చమురు మార్కెట్‌ కుదేలవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ఇంధనానికి డిమాండ్‌ పడిపోయింది. పశ్చిమ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ)లో సోమవారం బ్యారెల్‌ ముడి చమురు ధర కనీవినీ ఎరుగని విధంగా 15 డాలర్లకు పడిపోయింది. గత 21 ఏండ్లలో ఈ స్థాయిలో చమురు ధర పతనమవటం ఇదే మొదటిసారి. పడిపోతున్న ధరలను స్థిరీకరించేందుకు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు తమ రోజువారీ ఉత్పత్తిలో కోతపెట్టినప్పటికీ డిమాండ్‌ లేకపోవటంతో ధరలు పతనమవుతున్నాయి.