కరోనా నియంత్రణకు దేశ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న వేళ...భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావడంతో.. ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు ఓ డేటా సంస్థ వెల్లడించింది. జనతా ఖర్ఫ్యూ ప్రకటించినప్పటి నుంచి పూర్తిగా షట్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్నెట్ డేటాను భారీగా వినియోగించినట్టు పేర్కొంది. ఈ డేటా మార్చి 22 నుంచి మార్చి 28 మధ్యలో భారతీయ ఇంటర్నెట్ యూజర్లు సగటున 307,963 TB లేదా 307 పెటాబైట్స్ (PB) డేటా వినియోగించినట్టు వెల్లడించింది.